ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

105


గారనైషధము రచింపబడి యుండునని వీరి ముఖ్య తాత్సరమైయున్నది. ఆ కాలమున నిత్య ఇక్కడ పరిపాలనము చేసెనో వీరుచెప్పఁజాల కున్నారు. కాలమున వీనిదానధర్మములను దెలుపు శాసనము నొక్క దానినైనఁ గనఁబఱుపం జాలకున్నా ఇవియన్నియు వీరి యూహలు. ఇట్టి యూహలు చేయుటకుఁ గారణము హరవిలాసమున శృంగార నైషధము పేర్కొనబడుటయు హరవిలాసము కుమారగిరి రెడ్డి కాలమన రచింపఁబడెనని విశ్వసించుటయునై యున్నది. కాని యాంధ్రశృంగార నైషధమును వీరు బాగుగా, బరిశీలించి వాసినట్లు గానరాదు. గ్రంథమును విమర్శించి విషయములను జక్కగా బరిశీలించిన బుద్ధిమంతు లేవ్వరును. వీరివలె సవిశ్వాసమునకు బాత్రులుకాఁజూలరు. శ్రీ నాథుడతిశయోక్తులు చెప్పియుండ లేదని మేమునఁజాలముగాని శ్రీలక్ష్మణరావుగారూహించినంత నిరసనముగాఁ దలపోయుటకు మాత్రము సాహసింపజాలము. శృంగార నైషధము గృతినొందు నాటికి మామిడి సింగనామాత్యుడెట్టి స్థితిలోనుండెనో మనము విచా రించుటకు శ్రీనాథుఁడు శృంగార నైషధమును రచించి సింగనామాత్యుని కంకితము చేయుటకుఁ బూర్వమె యాతని యన్నయగు ప్రెగడ నామా . త్యునకు పండితారాధ్య చరిత్రమను మొదలగు కృతులను రచించి యంకితము చేసి జగంబుననుతి కెక్కి యున్న వాఁడని యిదివఱకె తెలిసి కొని యున్నారము. శృంగార నైషధవ తారీకయందు శ్రీనాథుఁడు సింగ నామాత్యు నిట్ల భివర్ణించి యున్నాఁడు.


మ. ఆరు దారంవివిదాగ్రగహారము లతో నాందోళి కాచ్ఛత్త్ర చా
మరక ళ్యాణకళాచీ కాజ బహుసమ్మా నార్హ చిహ్నంబు లా
దర వెంప్సొగఁ వేమభూనరుని చేతంగాచె సామాజ్య సం
భరణప్రౌడు డమాత్య సింగడు నయప్రాగల్భ్య గర్వోన్నతిన్.


ఇందలి తాత్పర్యము సింగనామాత్యుఁడు నీతిప్రౌడిగలిగి , నేర్ప రియై సామ్రాజ్య సంరక్షణమును జేసినందున సంతోషించి యపూ