ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి

చెప్పుకొని యుండునని యుమాకాంతము గారి యూహయైయున్నది, గాని శ్రీనాథుఁ డిట్టివిశేషణముం జేర్చికొనుటకుంగల గాథ నెఱింగియున్న యెడల నట్టియభిప్రాయమును వెలిఁబుచ్చక యుందురు.

అయినను ఇందును గూర్చి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 'కనకాభిషేక, మను నొక చిన్న పొత్త మునఁ జెప్పి నయర్థమునుఁ జేసిన వ్యాఖ్యయును గూడ మనము తెలిసి కొనవలసియున్నది. కనకాభి షేకమున మహా రాజతల్పమునఁ దూగియాడు చుండు నాకర్ణాటా ధీశ్వరుని (దేవరాయలు) నిండోలగమున డొక్క చెదరును బిక్క బెదరును లేక పాండిత్య శౌండీర్యమును వ్యక్త పఱచి యఖండపండితుఁడు మహాకవి బహుశిష్యపరివృతుడునై విజయడిండిమాడంబరమునఁ బ్రత్యర్థుల నద్రుంప జే యుచు నాప్రభుసార్వభౌమునినా స్థానింగవిసార్వభౌమ వైభవమనుభవిం చుచున్న యుండుని డిండిమభట్టారకు నుగ్భటవి వాదమున నోడఁగొట్టి యతని విజయడిండిమమును బగులగొట్టించి యత్యంత గౌర వాస్పద మగు నారాజేంద్రుని ముత్యాలశాలలోఁబ్రభుపండిత బహుమానపుర స్కృతముగాఁ గవిసార్వభౌమపదవిని గనకాభి షేకముతోఁ బట్టాభిషిక్తు డై' కవిసార్వభౌముఁడను బిరుదాంక నామధేయమునఁ బరగుటయ గాక యాకవిమార్తాండుఁడప్పుడు కర్ణాటరాజధాని (యంద లివిబుధ రాజి) యను. తమ్మతోపునల రార్చినకతన కర్ణాట దేశకటక పద్మవన హేళి, యనదనరారెను. " అని తమభావము విస్పష్టము జేసియున్నారు. కాబట్టి ప్రభాకరశాస్త్రిగారు చెప్పినదే సహేతుకముగను సయుక్తికముగను గనుబట్టుచున్నది. కర్ణాట దేశ కటకమను దానికి కర్ణాట దేశపు రాజధా

నియని యర్థమును గ్రహీంపవలయును.*[1]

  1. * శ్రీ రేశలింగము గారు నాయాంధ్రుల చరిత్రము మూడవ భాగములో నేను ప్రవేశ పెట్టిన యీ వాదస్వభావమును గుర్తించి 'తామీ నడుమ నూతనముగా బెంచి వ్రాసిన యాంధ్రకవుల చరిత్రలో శ్రీ నాధునిగూర్చి వ్రాయు సందర్భమున నానా.\ దీన్ని బట్టి శ్రీనాథుని జన్మభూమి