ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

శ్రీ నాథ కవి


నిండుజవ్వనమున రచియించినట్లు చెప్పియున్నాఁడు. నిండుజవ్వస మనఁగా ముప్పది మొదలు ముప్పదియైదు సంవత్సరములవఱకు నని చెప్పవచ్చును. అట్టి కాలమున శ్రీనాథుఁడు శృంగార నైషధమును రచిం చెను. . ఈయుత్తమ "కావ్యమును కొండవీటి ప్రభువైన శ్రీ పెద కోమటి వేనుభూ పాలుని ప్రధాన మంతియగు మామిడి సింగనామాత్యున కంకితము గావించెను. [1]*

ఈసింగనామాత్యునికి దాతయగు మామిడన్న భారద్వాజ గోత్రుఁడై , పెదతూర్క నమంత్రికి మనమఁడై , విక్రమపు రీసింహాసనా ధ్యాసియైన చిటి పెద్ద ప్రభునకుఁ గుమారుఁడై యధికవిమల శివాచార తత్పరుఁడై బంధురణ మహనీయసంపదచే విలసిల్లుచు ధర్మశీలుఁడై అక్కాంబికయందు 'నంశ పావనులైన నల్వురుపుత్తు లను బడసియుం డెను. వారలలో నగ్రజుడైన పెద్దనామాత్యుఁ డన వేమాధిపురాజ్య భార భరణన్యా పారదకుఁడై యుండెను.


ఈ యమాత్య శేఖరునకు వీరభద్రామాత్యుఁడు మారనామా త్యుఁడు, నామామాత్యుఁడు నను ప్రసిద్ధులైన మూవురు తమ్ములు వివిధ కార్యకరణదక్షులై యన్నకు విధేయులై యొక్కొక్కఁ డొక్క- విషయంబునఁబ్రజ్ఞాడ్యులై యుండిరని నైషధములోని పద్యములను నింతకుఁబూర్వము చూపియున్నాను.


ఈ పెద్దనామాత్యుఁడు గౌతమగోత్ర విఖ్యాతుఁడును ఆప స్తంబ సూత్ర పావనుఁడును, 'నగు శ్రీ కేతనామాత్య శేఖరునకుఁ బుత్రు డై చౌహ త్తమల్లుండు, చౌహత్తనారాయణుండు ఖడియ రాయండు, నను

బిరుదములచే దసరినట్టి యల్లాడమంత్రికి మహితపుణ్యయగు నన్న

  1. శ్రీనాథుఁడు శృంగార నైషధమును రాజమహేంద్రవరము నేలిన వేమారెడ్డి మంత్రి మామిడి సీంగ నార్యునకు ఆంకితము చేసెనని బ్రహ్మ శ్రీ వేదము వేంకటరాజరుశాస్త్రి గారు తమ సర్వంక షావ్యాఖ్యా సమేత ముద్రిత శృంగార నైషధ గంథాపతారక లో వ్రాసినది పొరపాటు,