ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

శ్రీనాథకవి


దించినవాఁడుగావున నప్రతిమాసప్రతిభాడ్యుడై శ్రీనాథుని నన్యనృప తుల పాలిక రగకుండఁ జేసి తనకడ నుంచుకొని యనుదినము నఖిల పురాణవిద్యాగమముల నతవివలస వినుచు "దేశము శాంతి నెలకొల్పన పిమ్మట యార్యవిద్యలం బోత్సహించి వర్దిల్లఁ జేయుటకై 1404 గవ సంవత్సరమున నాతని విద్యాధి కారిపదవి ముందుంచెను. ఈకాలము శ్రీనాధుని యుచ్చదశకుఁ బ్రారంభమని చెప్పఁదగును.

ఈసంవత్సరమున 'బెదకోమటి వేముఁడు చేసిన దానముల ను గూర్చి చేసిన శాసనములు గొన్ని గన్పట్టుచున్నవి. వానిలో మొదటిది కుఱునూతుల శిలాశాసనము. దీనిలో నెఱు పురీ దాశరధికి కుఱు నూతుల .గ్రామమును దానము చేసినట్లు చెప్పఁబడినదిగాని యందు శ్రీనాథుని పేరు గాన రాదు[1]* ఈశాసనమునాటికి శ్రీనాథుఁడు విద్యాధి కారిపదవిని బొందియుండ లేదు. రెండవది పొన్నుపల్లి తామ్రశాసనము , ఈశాసనము చివర శ్లోక మిట్లున్నది.

 * విద్వాధి కారీ శ్రీనాథో వీర శ్రీ వేమభూపతేః
ఆక గోదాకరోవాచాం నిర్మలం ధర్మశాసనం. "

అని యుండుటచేత 1404 వత్సరమునుండి విద్యాధికారిగ నుండె ననుట స్పష్టము. శ్రీనాథుని ప్రతిభాప్రఖ్యాతికి బెదకోమటి వేముని విద్యారసికత తోడ్పడి యుభయుల యశస్సును నాంధ్ర ప్రపంచమునం దంతటను వ్యాపించునట్లు చేసినది. విద్యాధి కారపదవి సొమాన్యమైనది కాదు. రాజసందర్శనార్దము శ్రౌతులు, "వేదవిదులు, షట్తర్కముల


  • ఈ శాసనము ప్రభారశాస్త్రి గారి గ్రంధమున నుదాహరింప బడినది. అందిట్లున్నది.

    శ్లో. మహారాజుస్సోయం రపకడహుతా లళేంమండితే
    శతాబ్దే శ్రావణ్యాం శశభృదుపరాగే ప్రకటితే
    వరంప్రీతకొసాదెఱ(విర) పురి దాశారధయే
    పరంగ్రామం కుల్నోంతి సమాఖ్యోముపగతం"