పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/75

ఈ పుట ఆమోదించబడ్డది

అగ్ని పొగచేత చుట్టబడినట్లును, అద్దము మకిలిచేత నావరింపబడి యున్నట్లును, గర్భము మావిచే నావరింపబడి యున్నట్లును దీనిచే జ్ఞానము నావరింప బడును. 3-38


ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా
కామరూపేణ కౌంతేయ దుష్పూరే ణానలేనచ.


జ్ఞానికి నిత్యవైరియైన యిది యెన్నికట్టెలు వేసినను తృప్తిపొందక మరింత ప్రజ్వలించు నగ్నివలెనున్నది. ఇది జ్ఞానమును చుట్టుకొని దానిని చెరుచుచున్నది. 3-39


ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠాన ముచ్యతే
ఏతైర్వి మోహయ త్యేష జ్ఞాన మావృత్య దేహినం.


ఇంద్రియములును, మనస్సును, బుద్ధియు, దీని యునికిపట్లని చెప్పబడుచున్నవి. వీనినిగొని యిది జ్ఞానమును చుట్టు కొని జీవుని కేమరుపాటు కలిగించును. 3-40


తస్మా త్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ
పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనం


కావున మొదటనే యింద్రియములను కాచికొని, జ్ఞానమును వివేకమును నాశనముచేయు నీక్రూర శత్రువును చంపుము. 3-41


త్రివిధం నరక స్యేదం ద్వారం నాశన మాత్మనః
కామః క్రోధస్తథాలోభస్తస్మా దేత త్త్రయంత్యజేత్.