పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/73

ఈ పుట ఆమోదించబడ్డది

విడిచి వెలికిరాగానే తన రెక్కలతో సులభముగా నీటిని దులిపివేసికొన్నట్లే, కర్మము చేయునపుడు ధర్మదృష్టిని కలిగి కార్యము తీరినపిదప నభిమానమును జయాపజయముల చింతను విడువ వలెను. లోకవ్యవహారమున పనిచేయుకాలమున, గమనికయు, చురుకును, సామర్థ్యమును నితరులకుండుట సాధ్యముకాదని చూచినవారు తలచునట్లు ప్రవర్తించి శుభ్రముగను, చురుకుగను పనులను చేయవలెను. పని ముగిసిన పిదప దానిఫలమును గూర్చిన చింతనే విడువ వలయును. ఈస్థానమును బొందుటకు ప్రయత్నము కావలెను. ముఖ్యముగా మనోవేగముల నడంచు మార్గము నభ్యసింప వలెను.


మనశ్శాంతికి శత్రువులు కామము క్రోధము లోభము అనునవి. ఈ కర్మయోగమునకు కావలసిన మనశ్శుద్ధియు, నిస్సంగత్వమును పొందుట కీ శత్రువుల కెడమివ్వక యెప్పుడును జాగ్రత్తగ మనస్సును కాపాడవలెను. మనస్సును సరిగ కాపాడినయెడల తక్కినదంతయుసులభమగును. మంచిచెడ్డలు రెంటికిని మనస్సున చొచ్చుతలపులేకారణము. మనస్సు నడచియుంచక విచ్చలవిడిగపోనిచ్చినయెడల, నిశ్చ యముగ నవి పెచ్చు పెరుగును. కోరికలను కామమనె భావమును కోటలో ప్రవేశ పెట్టినయెడల నవి పిదప బాగుగ మనలను లోబరచుకొనుచు ఇంద్రియములలో నివాస మేర్పరుచు