పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసుప్రభుత్వములో ప్రధానమంత్రివర్యుడైన శ్రీమాన్ రాజగోపాలాచార్యులవారు తమిళభాషా పండితులు. తాము వ్రాసిన విషయమును, ఆవిషయమును దెలుపుటకు వలయుభాషను సంపూర్ణముగ గ్రహించి వ్రాయగల యసాధారణశక్తి కలవారు. ఇదిగాక, తాము వ్రాయబోవు విషయమునుగురించి సంపూర్ణానుభవములేక, ఆయభిప్రాయమును తమజీవితము ననుసంధించి యాచరింపక గ్రంథరచన చేయరు. గీతాతత్త్వమును బాగుగా నవగాహన చేసికొని యాచరించు కర్మవీరులు. గీతాసారము సామాన్యజనులకు కూడ బోధపడున ట్లీగ్రంథమును బహు బుద్ధికుశలతతో రచించిరి.


ఇట్టి మహనీయులు వ్రాసిన గ్రంథము తెనుగులో లేకుండుట గొప్ప లోపమని గ్రహించి శ్రీ న్యాపతి సుబ్బారావుపంతులుగారు, డాక్టర్ చిలుకూరి నారాయణరావు ఎమ్. ఏ., పి. హెచ్. డి., గారిని "కణ్ణన్ కాట్టియవట్టి" "కృష్ణుడు చూపిన మార్గము" అను నీగ్రంథమును తెనిగింపవలసినదని కోరగా వారు సంతోషముతో నంగీకరించిరి. వారు శ్రద్ధతోను, భక్తితోను, సర్వజనసుభొధము కావలెన నుద్దేశముతోను అనువాదించినారు. పండిత చిలకమర్తి లక్ష్మీనృసింహ కవిగారు దీనిని సరిచూచినారు. వీరుభయులకును, తమిళ గ్రంథమును తెలుగున ప్రచురించుటకు అనుమతి ఒసంగిన