పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/144

ఈ పుట ఆమోదించబడ్డది

మనస్సును స్థిరపరచుకొని, యప్పుడప్పు డధ్యాత్మధ్యానము చేయుట.


(6) భగవంతుని సంపూర్ణముగ శరణుజొచ్చుట.


పై చెప్పబడిన యంగములలో నొక్కొక్కదానిని ప్రత్యేకముగ పేరుచెప్పి క్రమముగ చెప్పవలసిన యెడల, వానిని సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, సన్యాసయోగము, అధ్యాత్మయోగము, భక్తియోగము అని అనేకవిధములుగ చెప్పవచ్చును. కాని నిజముగ నభ్యాసముచేయు క్రమమున నివన్నియు నొకదానిలో నొకటి కలిసి యుండును. ఒకటిగా దానిని పొందవీలులేదు. కావున గీత యందీక్రమముల నెల్ల నొక్కటిగ గూర్చి యేకముఖముగ భగవంతు డుపదేశించి యున్నాడు.


భక్తితోడను, శ్రద్ధతోడను, దీనిని చదువువారిలో కొందరికి తుదకొక సందేహము తోచవచ్చును. గీతలోచెప్పి యున్నదంతయు సరియే. కాని సాధారణమనుష్యుల కది యుపయోగపడునా? దీనిలో చూపబడిన లక్ష్యములన్నిటిని పొందుశక్తిమనకు లేదుగదా ! ఇది మనకెట్లు ప్రాప్తమగును? మహాత్ములకు మాత్రము దీనిలో చెప్పబడినది సాధ్యము. అని ఈరీతిగా నాక్షేపణ తోచవచ్చును.

కృష్ణుడు చూపించిన దారిమాత్రమే కాదు, లోకములో జనులనుసరించు నెల్లమతములును, మార్గములును, నీ