పుట:Sri Suryaraya Vidyananda Library-Pithapuram.pdf/3

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ శతవార్షికోత్సవ సందర్భములో ప్రచురించిన వ్యాసము

సంకలనము : మునగాల భరతుడు బి.ఎ., గ్రంథాలయ ఉపాధ్యక్షులు

గ్రంథాలయ చరిత్ర : గ్రంథాలయంకు మొదట 37 సంవత్సరములు స్థానిక దామెర సీతారామస్వామిగారి మేడపై ఆశ్రయం కల్పించినారు. తరువాత గ్రంథాలయం పేరుమీద ది. 6-11-1947 తేదీన ప్రస్తుతమున్న స్థలం య. 28-06 సెంట్లును రూ. 1530/- లు ఖరీదుతో రిజిస్ట్రేషన్ చేయించడమైనది. పాతభవనం శిథిలమైనందున 2001 సం॥రంలో దాత బాదం మాధవరావుగారు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో నూతన భవనం నిర్మించి ప్రజలకు అంకితం చేసినారు. మరియు గ్రంథాలయం నడుపుటకు నూతన షాపుల నిర్మాణంలో ఆర్థిక సహాయం చేశారు. 2001 సం॥రంలో వచ్చిన కో-ఆపరేటివ్ యాక్ట్ నెం. 35 ప్రకారం గ్రంథాలయంను ది. 17-7-2009వ తేదీన రిజిస్ట్రేషన్ చేయడమైనది. రి.నెం. 465/2009 బైలాస్ ప్రకారం ఎన్నికైన కార్యవర్గం మాత్రమే గ్రంథాలయం నడుపుటకు అర్హులు. ప్రతీ సంవత్సరం మార్చి నెలలో సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేసి జమాఖర్చులు ఆమోదింప చేసికొని రెన్యువల్ నిమిత్తం జిల్లా రిజిస్ట్రారు వార్కి పంపవలసియుండును. సదరు యాక్టులోని సెక్షన్ 24, 25 ప్రకారం గ్రంథాలయ ఆస్తులు అమ్ముటకు ఎవరికీ అధికారం లేదు. గ్రంథాలయంలో సుమారు 20,000 గ్రంథాలు, పాఠకులకు అందుబాటులో నున్నవి. గ్రంథాలయంకు వచ్చు పత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, వార్త, ఆంధ్రభూమి, విశాలాంధ్ర, విజయభాను, విజన్, ఆంగ్లపత్రికలు : దక్కన్ క్రానికల్, ది హిందూ, మాసత్రికలు : సప్తగిరి, రామకృష్ణ ప్రభ, గ్రంథాలయ సర్వస్వం, వండర్ వరల్డు, ఆయుర్వేదం. ప్రతీ రోజు సుమారు వందమంది పాఠకులు గ్రంథాలయమును సందర్శించుచున్నారు. సభ్యత్వ రుసుం సంవత్సరమునకు రూ.75/-లు, జీవిత సభ్యత్వం రూ.1,000/ - లు, సభ్యులకు 2 పుస్తకములు ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చును. రిఫరెన్సు పుస్తకములు గ్రంథాలయంలోనే చదువవచ్చును. ఎవరైనను గ్రంథాలయంనకు పుస్తకములు బహూకరించవచ్చును. అట్టివార్కి ప్రశంసాపత్రం ఇవ్వబడును. గ్రంథాలయం తెరచు వేళలు: ఉ॥ 9 గం॥ల నుండి 12 గం॥ల వరకు సా॥ 5 గం॥ల నుండి 8 గం॥ల వరకు బుధవారం శలవు. రసీదు పుస్తకం లైబ్రేరియన్ దగ్గర ఉన్నది. సభ్యత్వ రుసుం చెల్లించిన వెంటనే రశీదు పొందవచ్చును. గ్రంథాలయంకు నెలకు అద్దెల రూపేణా రూ. 14,000/-లు ఆదాయము వచ్చుచున్నది. గ్రంధాలయం 1915 సం॥లో ప్రారంభమై 2015 నాటికి వంద సంవత్సరములు పూర్తి చేసుకుని శతవార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో గ్రంధాలయ సభ్యులకు, పాఠాకులకు, అభిమానులకు, విరాళాలు యిచ్చిన దాతలకు శుభాభివందనములు. గ్రంథాలయ సంపదను కాపాడుతూ భావితరాలకు అందించడానికి నిరంతరం శ్రమించిన కీర్తిశేషులు చెలికాని భావనరావుగారికి కూడా వంద సంవత్సరములు పూర్తి కావడం వలన వారి శతజయంతి కూడా ది. 11-8-2015 తేదీని జరుపుటకునిర్ణయించబడినది.

3