ఈ పుట ఆమోదించబడ్డది
కట్టా వరదరాజకృతమగు
శ్రీ రామాయణము
యుద్ధకాండము
__________:o:____________
శ్రీరాజిత శుభాంగ!- చిరగుణిసంగ
హారికృపాపాంగ! - యలమేలుమంగ!
భావుక! శతకోటి - భానుసంకాశ!
సేవకాత్మనివేశ - శ్రీవేంకటేశ!
అవధారు !కుశలవు - లారామచంద్రుఁ
డవధరింపంగ రా - మాయణం బిట్లు
వినిపించు తత్కథా - వృత్తాంతమెల్లఁ
గనుపించు నవ్వలి - కథ యెట్టులనిన
-: శ్రీరాముఁడు సీతావృత్తాంతముఁ దెల్పినందులకు హనుమంతునభినందించుట :-
శ్రీరామచంద్రుఁడా - సీతవృత్తాంత
మా రమణీమణి - యనిన మాటలను
హనుమంతుచేవిని - యతులితానంద
మునఁదేలి మానసం - బున వెఱఁగంది