208
శ్రీరామాయణము
బలికె జానకి లంక - పై వీడియుటకు
జల రాశిఁ దాఁట యో - జన సేయుఁ”డనుచుఁ
బలికి భానుప్రభా - భాసురం బైన
సీత శిరోమణి - చే చాఁచి యొసఁగఁ
జేత నందుక రఘు -శ్రేష్ఠుఁడుప్పొంగె ! 4890
అప్పుడు సన్నిధి - నవనిజఁ గాంచు
చొప్పునఁ దనివోక - చూచి హర్షించి
గళ్ళ పాలిక నొత్తి - కన్నులఁ జేర్చి
యుల్లంబు చల్లగా - నురము పై నుంచి
"హా ! సీత !”యని యేడ్చు - నన్న నీక్షించి
యాసుమిత్రాపుత్రుఁ - డడలుచు నుండ
"వనధిఁ గౌస్తుభముద్బ - వము నొందినట్లు
జనియించె నిది నిట - జనకభూపతికి
బృందార కేంద్రుఁ డ - ర్పించె యాగమున !
ఎందును వెల లేని - యీ మానికంబు 4900
నా పెండ్లి నాఁడర - ణముగాఁగ నిచ్చెఁ
జేపట్టి పట్టియౌ - సీతకొప్పునకు
నీమణివరముఁ దా - నెప్పుడు సీత
సీమంతవీధికి - శృంగారకరము !
సీత ధరింపఁ జూ - చిన వాఁడ నాదు
చేతఁ గైకొని ధరిం - చిన మనఁగలనె ?
స్త్రీశిరోమణియైన - సీత వేనలిని
యీశిరోమణిఁ దాల్ప - యిఁకఁ జూతునొక్కో !
ఏమయ్యెనో సీత - యెందు నున్నదియొ ?
ఏమి సేయుదునని - యేనుంటిగాక 4910