పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

వెలయగ బొండుమల్లియలు వేనలి నంగమునన్ విభూషణా
వళులు ధరించి లేఁబసుపువన్నియపుట్టముఁ గట్టి కుంకుమం
బలఁది పసిండితామరలు హస్తములన్ వెలుఁగొంద భర్మని
ర్మలరుచిఁ బొల్చు వైశ్యకులమాతృక భూరిధనప్రదాయి యై.


గీ.

కృతులఁ ద్రత్వత్రయమ్మును దత్వమొకటి
యటులుగాక తవర్ణత్రయముఁ ద్రకార
మొకటి ప్రాసంబులుగ నిల్ప సుకవిచంద్రు
లవనిలోఁ ద్రివర్ణప్రాస మండ్రు శౌరి.

ఈతని గ్రంథమునుండి యుదాహరణములను గైకొనకపోయినను, అప్పకవి యీతనిని దనగ్రంథమునఁ బేర్కొనియుండుటచే నీతఁ డప్పకవికిఁ బూర్వుఁ డనుట నిశ్చయము - శ్రీ మానవల్లి రామకృష్ణకవి గారు శ్రీధరచ్ఛంద మళియరామరాయలముత్తాత కంకితమీయఁబడినదని బద్దెన నీతిశాస్త్రముక్తావళిపీఠికలో వ్రాసియున్నారు. శ్రీధరచ్ఛందమునందు బద్దెన నీతిశాస్త్రముక్తావళిలోనిపద్యము లుదాహరింపఁబడినవని రామకృష్ణకవిగారు వ్రాసియుండుటచే నాగ్రంథ మాయనయొద్ద నున్నదని యూహింపఁదగియున్నది. నాకు శ్రీధరునిగ్రంథము లభింపలేదు. అళియరామరాయలముత్తాత ఆరెవీటి బుక్కరాజు. ఇతడు ప్రసిద్ధపురురుషుడు. రామకృష్ణకవిగారు ఆరెవీటిబుక్కరాయ లని వ్రాయక యళియరామరాయలముత్తాత యని యేల వ్రాసిరో తెలియకున్నది. బుక్కరాయలు బాహుబలముచేఁ గీర్తిని సంపాదించినవాఁడు కాని కవిపండితపోషకుఁ డనుకీర్తి యాతనికి లేదు. రామరాజభూషణుఁడును బింగళి సూరనార్యుఁడును బుక్కరాయలను వర్ణించిన పద్యముల నీక్రింద నిచ్చుచున్నాఁడను.

సీ.

తనభవ్యధామంబు తనభవ్యధామంబు
                      కరణి మిత్రోన్మేషకరము గాఁగఁ
దనధర్మగుణములు దనధర్మగుణము ల
                      ట్లతులితశ్రుతిమార్గగతుల నెసఁగఁ
ధనమహాహవదీక్ష దనమహాహనదీక్ష
                      పగిది నానావనీపకులఁ బెంపఁ