పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi

బీరుదగద్యములు సంబోధనాంతములుగా నుండవలెనని యాతఁడు చెప్పీనాఁడు. అట్లేప్రాచీన రాజుల బిరుదగద్యములునున్న విగాని యాగద్యములకెల్ల సంబోధనాంతత నియతముగా నుండునన్న నిర్ణయము నిలువదేమో! ఆశ్వాసాంత బిరుదగద్యములు సంబోధనాంతములుగా నుండవుగదా !

అనంతామాత్యుఁడు (వచన)గద్యమనియు, లక్షణశిరోమణికారుఁడు విన్నప మనియుఁ బేర్కొన్నతీరు రచనము లవి సంస్కృతమున శ్రీభగవద్రామానుజాచార్యులవారు రచించిన గద్యత్రయమును బాల్కురికి సోమనాథుఁడు రచించిన పంచప్రకారగద్యాదులను బురస్కరించుకొని, కర్ణాటాంధ్రములలో వైష్ణవ శైవభక్తులు సాగించిన రచనములయి యుండునని నేననుమానించుచున్నాఁడను. తెలుఁగున నాకుఁగానవచ్చిన యిట్టి రచనలలోఁ బ్రాచీనమనఁదగినవి ' సింహగిరి వచనములు '.వీనికిఁ గృష్ణమాచార్య సంకీర్తనములని నామాంతరము.[1]

మచ్చునకాతనివచనమొకటి.

దేవా ! పదికోట్ల యజ్ఞాదిక్రతువులు నడపంగానేమి, తొమ్మిది కోట్ల తులాభారంబులు తూఁగంగానేమి, యెనిమిది కోట్ల సువర్ణదానంబులు, నేడుకోట్ల గోదానంబులు, నాఱుకోట్ల భూదానంబులు, నయిదు కోట్ల కన్యాదానంబులు, నాలుగుకోట్ల వస్త్రదానంబులు సేయంగానేమి, మూఁడుకోట్ల సత్యాదివ్రతంబులు నలుపంగానేమి. రెండుకోట్ల యన్నదానంబులు గావింపగానేమి, కోటి స్నానంబులు సేయంగానేమి, మీ నామోచ్చారణంబు సేయక! పదివేల యజ్ఞాది క్రతువులు నడపిన దేవేంద్రుండునిలువల్ల యోనులయ్యెను. తొమ్మిదికోట్లతులాభారంబులు తూగిన దుర్యోధనుండు యమపురికేఁగెను. ఎనిమిది కోట్ల సువర్ణదానంబులు సేసిన కరుండు పసిండికొండమీఁది యన్నంబుల కపేక్షించెను. ఏడుకోట్ల గోదానంబులు చేసిన కార్తవీర్యార్జునుండు గోహత్యా బ్రహ్మహత్యా పాతకంబులఁ బొందెను. ఆఱుకోట్ల భూదానంబులు


  1. ఆ వచనములు రచియించిన కృష్ణమాచార్యుఁడు కాకతీయప్రతాపరుద్రుని నాఁటివాఁడని, యేక శిలానగర చరిత్రాదులవలనఁ దెలియగును.