పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/13

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii

అన్నమాచార్యుఁడు.

ఈతఁడు వైష్ణవమతమును స్వీకరించిఁనవాడు గొప్పభక్తుఁడు. కవి. మహిమలుగలవాఁడు. ఈతఁడు తొంబదియాఱేండ్లు జీవించెను. ఇతనికుమారుఁడగు పెద తిరుమలాచార్యుని కోర్కిచొప్పున నీ యన్నమాచార్యుఁడు దినమునకొక్కదానికేనితక్కువకాని చొప్పునగేయములు రచించుచుశ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిని సంకీర్తనము చేయుచుండు వాడట! ఈత కిఁ బదునాఱవయేట స్వామి ప్రత్యక్షమయ్యెనట! తదాది యెనుబది యేండ్లదాక నీతఁడు సంకీర్తనములు రచించుచునే యుండెను.

ఈతనికిఁ సంకీర్తనాచార్యుఁడని ద్రావిడాగమసార్వభౌముఁడని, పంచమాగమచక్రవర్తియనిబిరుదులు. శ్రీవేంకటేశ్వరస్వామికీతఁడు మామ. అలమేలుమంగాంబ కీతఁడు తండ్రి వరుసవాఁడు. ఇతని సంకీర్తనలను వినిన చెవిని మఱొకరి సంకీర్తనముల విననొల్లనని శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిజ్ఞఁగావించెనట ! ఈతఁడు రచించిన గ్రంథములు, ౧ అధ్యాత్మ సంకీర్తనలు ౨ శృంగార సంకీర్తనలు 3 శృంగారమంజరి ౪ సంకీర్తన లక్షణము (సంస్కృతము; ఇది దొరకలేదు) ఈకవికి సంబంధించిన చరిత్రము శాసనాదులందుఁగాన రాదు. [1]కాని, తాళ్లపాక చిన్నన్న ద్విపదకృతిగా నితనిచరిత్రము రచించినాఁడు. ఈతని కుమారుఁడు;

[2]పెద తిరుమలాచార్యుఁడు.

ఈతఁడే ప్రస్తుత గ్రంథమగు శ్రీవేంకటేశ్వర వచనములకుఁగర్త. శ్రీ తిరుపతి దేవస్థానముననున్న రాగి ఱేకులమీఁద నీ వచనములు తిరుమలాచార్యరచితములని గ్రంథారంభమునఁ జెప్పఁబడినది. ఈతఁడు మహైశ్వర్యమహితుఁడుగావెలసెను. శ్రీ వేంకటేశ్వరస్వామి కీతఁడనేక కైంకర్యముల జరపించెను. శ్రీస్వామి యీతనితోఁ దరువాతి మూఁడు తరములదాఁక ప్రత్యక్షమును, నేడుతరములదాఁకఁ బరమపదమునునను


  1. ఇది తిరుపతి ఓరియంటల్ యిన్స్టిట్యూట్ లైబ్రరిలోనున్నది.
  2. ఈతఁడు పెరియ తిరుమలా చార్యుఁడని, పెద తిరుమలాచార్యుఁడని, పెద తిరుమలయ్యయని, తిరుమలార్య దేశికుఁడని పలు తెఱఁగుల జేర్కొనఁబడుచున్నాఁడు.