ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

93


సైమనుకమీషను మదరాసుకు వచ్చినపుడు ఏర్పడిన అల్లరులు చరిత్రాత్మకములైనవి గాన ఆ అల్లరుల వివరములగూర్చివ్రాయుట అనవసరమని తలచుచున్నాను. కమీషనువచ్చినరోజున శ్రీమా౯ ఒక నల్ల జెండాను చేతబట్టుకొని కాంగ్రెసు సేవకులతోను వాలంటీర్లతోను ఒక ఊరేగింపు సాగించిరి. వీరు అనవసరముగా నెవరినిగాని నిర్బంధింప యత్నింపరుకాని ప్రజలు ఉత్సాహపూరితులైనందున అల్లరిజనించి రాళ్లు విసరిరి. 'లాటీచార్జి సాగినచో తా నెంతమాత్రము ఈ సంభవమును చూచువాడను కాను. ఊరేగింపును అధికారులు అడ్డగింతురు కావున ప్రజలందరును నెమ్మెదిగా, కేకలువేయక తనవెంబడి రావలెనని ఆదేశించిరి. కాని ఏమి తటస్థించునో అని అందరును భయపడిరి. మెరీనా సమీపమున యూనివర్సిటీభవనముల దగ్గరనున్న వారధిమీదుగా ఊరేగింపు వెళ్లుచున్నపుడు సాయుధపోలీసులు అడ్డపడి అందరిని వెనుకకు వెళ్లిపొమ్మని కోరిరి. కల్లకపటములు శ్రీమానునందు ఇసుమంతయు కనబడవు గాన ఇంటిలోగాని సభలోగాని ఏమాటలు పల్కుచుందురో వానినే పోలీసు అధికారులయెదుట పల్కిరి. కోపిష్ఠి గావున మండిపడుచు వీరు చెప్పినమాటలు పోలీసు అధికారుల