ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

87


శ్రీమా౯గారు అనుచరులందరిలోను శ్రీ ముత్తురంగమొదలారిపై అభిమానము హెచ్చుగ కనబరచుచుండిరి. వీ రొకరే చివరవరకు విశ్వాసముతో వర్తించిరని తలచుచు శ్రీమా౯ కాంగ్రెసును వదలినప్పుడు వీరి పదవులను కొన్నిటిని వారికి లభింప జేసినందుచే అరవరాష్ట్ర కాంగ్రెసుకమిటీకి శ్రీ మొదలారి అధ్యక్షులైరి.

మదరాసు క్రిస్టియనుకాలేజీలో చాలకాలము ఇంగ్లీషు ట్యూటరుగ నుండినవారును జస్టిసుకక్షలో ప్రముఖులగు శ్రీ ఓ. ధనికాచలముచెట్టి సోదరులును అగు శ్రీ ఓ. కందస్వామిచెట్టి మదరాసు హిందూ సాంఘిక సంస్కరణసభకు కార్యదర్శిగ సున్నప్పుడు శ్రీమా౯గారి దగ్గరకు పలుమారు వచ్చుచుండెను. ఆమీద కొన్నిరోజులకు కాలేజీ నౌకరి వదలినమీదట శ్రీ కందస్వామి మదరాసు కార్పరేషను ఎన్నికలలో పాల్గొనదలచి శ్రీ అయ్యంగారిని ఆశ్రయించి కాంగ్రెసు అభ్యర్థిగా నిలబడెను. ఇందుకు ముందే శ్రీ కందస్వామి జస్టిసుకక్షవదలి కాంగ్రెసున జేరినందుకు జస్టిసుకక్షనాయకులు శ్రీ కందస్వామిని దూషించిరని హైకోర్టున నొక పరువునష్ట దావాను శ్రీ పానగల్లురాజాపై దాఖలు చేసిరి. ఈ కేసువిచారణ సక్రమముగా సాగుటకు