ఈ పుట ఆమోదించబడ్డది

58

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.


నాయరువంటి మితవాద శిఖామణులుగూడ బ్రిటిషు ప్రభుత్వచర్యలవల్ల అసహ్యముజనించి, హైకోర్టు పదవికి రాజీనామాయిచ్చిరి. కావున శ్రీమా౯ అయ్యంగారు. అప్పుడేగాకున్నను, కొన్నినెలలకు అడ్వకేటుజనరలుపదవికి రాజీనామాయిచ్చిరి. ఈ సందర్భమున భార్య అభిప్రాయమును వీరు కోరిరి గాని యామె మౌనమువహించి యుండెను. అనేకాంశములలో వీరుభయులు సంప్రతించినమీదనే శ్రీమా౯గారు ఒక తీర్మానమునకువచ్చెడివారు. పాత్రము ననుసరించి మాట్లాడుస్వభావము శ్రీమా౯గారికి నెప్పుడు నలవడలేదు కావున తనకుతోచిన దానిని పైకి చెప్పుచుండెడివారు. 1920 సం|| ఫిబ్రవరిలో ఒకరోజున కోర్టునుండి ఇంటికి రాగానే పదవిని వదలుకొంటినని భార్యకు తెలియఁజేసిరి. వీరు కాంగ్రెసునఁజేరి ఎన్నడు కారాగారము ప్రవేశింతురో యనుభయము భార్యకు జనించెను. కాని భార్య తనభీతిని వెల్లడింపక పదవిని వదలినందుకు ఆమోదమును సూచించెను.

శ్రీమా౯గారు పదవిని వదలినవెంటనే కాంగ్రెసున ప్రవేశింపలేదు. సర్కారుకక్షలోచేరక స్వతంత్రులుగా వ్యవహరించుచుండిరి. అందుమీదట దేశము