ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

57


చూడబడుసందర్బమును వీరు గర్హించెడివారు. ఐరోపియనులు భారతీయులకు సమానగౌరవము చూపవలెనని పట్టుబట్టుటకు ప్రారంభించిరి.

అప్పట్లో నింటియం దొకరోజున భార్యతో మాట్లాడుచు గవర్నరు విల్లి౯గ్డ౯ తన్ను యిబ్బంది పాలు గావించుచున్నాడనియు పాడుపదవిని వదలుకొన నిశ్చయించితిననియు జెప్పిరి. కాని, వీరిభార్య ఇందుకు ఏబదులుచెప్పలేదు. ఆరునెలలు శ్రీఆనిబిసెంటును ఉదకమండలమున కాపుదలలోనుంచి ఆమీద వదలిపెట్టిరి. అప్పుడే శ్రీగాంధీగారి ఉద్యమము భారతదేశమున నావిర్భవించెను. కావున శ్రీగాంధీగారి శాసనోల్లంఘనకృషి వీరికి అసంతృప్తిని గలిగించెను. కొంతకాలమునకు శ్రీగాంధీగారి యుద్యమమున శ్రీమా౯పాల్గొనుటకు ప్రారంభించిరి.1919 సం!!న ఏప్రెలునెలలో 'జలియ౯వాలాభాగున' పంజాబురాష్ట్రమునసైనిక ప్రభుత్వనిర్మాణము రాత్రులలో పైకివెళ్లరాదనియు పైకివెళ్లినవారిని కాల్చెదమనియు ప్రభుత్వము శాసించుటచే భారతీయులందఱిని కలవరపెట్టుటయేగాక యీదురన్యాయముల తుదముట్టింప తీవ్రప్రయత్నములు అచ్చటచ్చట ప్రారంభింపఁబడెను. సర్. శంకర౯