ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

49


అయ్యంగారిఅల్లుడు, కాని కొన్నిసందర్భములలో వీరిదిపైచేయి” అనగా న్యాయవాదివృత్తిలో శ్రీమా౯గారి బుద్ధికుశలత అతితీక్ష్ణమైనదని శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరు భావించియే పైతీరున పరిచయముచేసిరి.

సాంఘికసంస్కరణలగావింప నేర్పడినసంఘము వారు వీరినితమగోష్ఠీలో చేర్చుకోలేదుగాని కొన్ని సందర్బములలో సంఘసంస్కరణము ఆవశ్యకమనియే వీరుతలచుచు సర్: శ్రీశంకర౯నాయరు కక్షలోకలసి కొంతకాలముపాటుపడిరి. కావున శ్రీమా౯గారిపై సర్ : శ్రీశంకర౯నాయరుగారికి క్రమేణ అభిమానము హెచ్చెనని తెలియుచున్నది. న్యాయవాదవృత్తిలోనున్నను ప్రజాసేవగావించిన దేశమునకు కొంతమేలు సాగింపవీలగునని ప్రపంచమునకు వెల్లడించిన వారు సర్: శ్రీ శంకర౯నాయరు గారని శ్రీమా౯ చెప్పెడివారు. కొంతకాలమునకు శంకర౯నాయరుగోష్ఠీ మతజాతిభేదములకు ప్రాముఖ్యతనిచ్చినందుచే నీగోష్ఠీతో శ్రీమా౯గారు సంబంధము వదలుకొనిరి.

(శ్రీ మణిఅయ్యరు) జస్టిసు సర్. సుబ్రహ్మణ్యయ్యరుపేర్లను ఎవరైన చెప్పినంత మాత్రముననే తన