ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమా౯ ఎస్. శ్రీనివాసఆయ్యంగారి

జీవితము

శ్రీమా౯ అయ్యంగారు 1874 వ సం!! సెప్టెంబరు తే 11 దీన, రామనాథపురమున జన్మించిరి. సామాన్యులైన వీరి తండ్రి శ్రీ ఎస్. శేషాద్రిఅయ్యంగారు ఒక శ్రీవైష్ణవులు. బాల్యమునందేగాక వయస్సు వచ్చిన మీదటఁగూడ కష్టములకుపాలై స్వశక్తివల్ల కుటుంబ వ్యవహారముల నిర్వహించుచుండిరి. ప్రాంభమున పాంబ౯ అమీ౯కోర్టున వీరు ప్లీడరుగ నుండిరనియు, ఆరోజులలో అమీనులకు మేజస్ట్రేటు అధికారము కూడ కలదనియు తెలియుచున్నది. కావున శ్రీ శేషాద్రిఅయ్యంగారు ఒకమోస్తరుగ పాంబనున కాలక్షేపము జరుపుచుండిరి. ఆరోజులలో నీప్లీడర్లు న్యాయశాస్త్రవిద్యగడించి పరీక్షలలో ప్యాసు గావలసిన అవసరములేకుండెను. బుద్దిసూక్ష్మతవల్లను, లోకవ్యవహారములలోని అనుభవమువల్లను, తెలివి తేటలు సంపాదించుకొని చక్కగా మాట్లాడుటకు శక్తియున్నచో కోర్టులలో ప్లీడర్లుగా వ్యవహరింప