ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

159


కమిటీన రికార్డులన్నిటిని జాగ్రతగ నా స్వాధీనమున యుంచుకొనమని శ్రీమా౯గారి ఆదేశము కావున ఇందుకు సమ్మతించితిని కాని ఈపని అతికష్టముగా నుండెను. సి. ఐ. డి. లు కొన్ని కాగితములను నావద్ద లాగికొనుటకు యత్నించుటచే అనేక కష్టములకు పాలైతిని. చలిప్రదేశము కావున చీకటిపడగానే ఒకటి రెండుసార్లు మూత్ర విసర్జనమునకు అవసర ముండెడిది. దేవాలయ ఆవరణములో మరుగుదొడ్డి లేదు కావున పైకివెళ్లవలసినదిగ నేర్పడెను. అప్పుడు నావద్దనున్న కాకితములను కట్టగట్టి ఒకపెట్టెలోనుంచి వెళ్లుటకు అవకాశము లేకపోయెను. కాకితములను చంకబెట్టుకొని వెళ్లినచో వాటిని లాగికొందురేమో* అనుభీతి జనించెను. రెండు రోజులు ఇబ్బందిపడిన మీదట శ్రీమా౯గారితో నా కష్టములను చెప్పుకొంటిని. వెంటనే వీరు కమిటీ కార్యదర్శియగు పండిట్ కే. సంతానముగారితో ఒక ఇనుపపెట్టెను తెప్పించి నాకిమ్మని చెప్పిరి. ఈపెట్టెరాగానే అందు కాకితములనుంచి తలచినపుడు పైకి వెళ్లుచుంటిని. ఈకమిటీల విచారణలలో నేను హాజరైనందుచే నాకు చక్కని అనుభవము అలవడెను. కొంతకాల