ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

149

చెన్నపట్టణమున 1910 సం!! ప్రాంతమున తెనుగు వకీళ్లు కొందరు మాత్రమే హైకోర్టున న్యాయవాదులుగనుండిరి. వీరిలో శ్రీపేరి నారాయణమూర్తిగారు కీర్తిగడించి గొప్ప అప్పీళ్ల చేపట్టుచు అరవలచే గౌరవింపబడుచుండిరి. శ్రీవేపా రామేశముగారుకూడ అప్పటికే బి. ఏ., బి. ఎల్., పరీక్షలో అగ్రగణ్యులై న్యాయవాదులైరి కాని వీరికి ఫైలు తక్కున కావున కొంతకాలమునకు గవర్నమెంటు ప్లీడరైరి. శ్రీపేరి నారాయణమూర్తిగారు. నెలకు 4, 5 వేలు ఆర్జించుచు పైకి వచ్చిరి. శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యరుగారి ప్రోత్సాహమున శ్రీ బి. ఎన్. శర్మగారు. విశాఖపట్టణమువదలి మద్రాసుకు వచ్చిరి కాని, వీరి ఆర్జనకూడ తక్కువగ నుండెను. హైకోర్టు ఒరిజనల్ సైడున శ్రీరంగాపఝల శ్రీరామశాస్త్రిగారు కొంత ప్రాముఖ్యతకు వచ్చిరి కావున వీరు విజయనగరము సంస్థానము దావాను విశాఖపట్టణము జిల్లాకోర్టులో దాఖలుచేయుటకు మరికొందరు వకీళ్లతో నియమింపబడిరి. కొంతకాలము ముందు విజయనగర సంస్థానాధీశుల వంశావళిని నాతండ్రిగారు ముద్రించియుండిరి. కావున దాని తాలూకు వ్రాత