పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణ ము


చాల కటిక నేలను రెల్లు చాప మీఁదఁ
గందమూలముల్ గుడిచి నిష్కామ వృతి,
సుద్దులాడ నొక్కరినైనఁ జూడకుండ
నెట్లు దినములు వేగింతు విచటనుండి !


గాంగ సైకతమ్ముల మీఁదఁ గట్టినట్టి
పూరి యింటిలో నీవు కాపురము నిల్చి
చలికి గ్రోసి శుష్కోప వాసములు డస్సి
బ్రహ్మచర్యంబు సడప దార్డ్యంబు గలదె?


నీవారి నుజ్జగించియు
నీవారాన్నంబు గుగుడిచి నిలువె యిచ్చో ?
నీవారి దావీ నిత్యము .
నీవారి మనంబు కుంద నిస్వించుటచే,


ఎంతకాల మిందు నేకమంబున నుండి .
యధ్యయసముఁ జేయ ననుపు పడునో
తామసింపకుండ ధర్మ సూక్ష్మంబులు
తెలియఁ బఱతుఁ దేట తెల్లముగను.


అనిన మ స్తన్య స్తహస్తుండనై, నిస్తుల మహిమాభి రా మయు, సమస్త వస్త్యంతర్యామయు నగు నాదీశ క్తి ల గూర్చి ప్రస్తుతించి విననుత శిరస్కుండనై తలోదారవిందంబులదృష్టి నిబద్దముఁ జేసి యీకరణి విన్నవించుకొని.......


90