పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/85

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణ ము

వడుగులు మూడు ప్రొద్దులను భ క్తిని స్నానములాడుకోర్కెమై
మడుగులలోనికి దిగుచు మాటికీ వచ్చుచుఁ బోవుచుండఁగా
నడుగుల జాడ "లేటి యిసుక ందున సైతము గానవచ్చె న
ప్పుడు పొడగట్టెఁ గట్టెదుటఁ బొంకముగా నొక పర్ణశాలయున్ .


కల్మషాభావమైన గంగా స్రవంతి
యమల తోయంబునం దీదు లాడుచున్న
పలు తెఱంగుల రంగుల పులుఁగు టెలుఁగు
లాలకించితిఁ గర్ల పేయంబు గాఁగ.


పర్ణశాలముందు బాదరిం చెడు నట్టి
వేది మధ్యమందు వెల్గువాని .
భస్మలిప్త దేహుఁ బద్మాసనస్థునిఁ
గాంచినాఁడ సతుల కౌతుకమున,


కాంచినయంత నామదికిఁ గల్గెను గట్టి ప్రశాంతి, బహ్మ తే
జోంచిత మాని చంద్రవదనాబ్జ గళత్కరుణాప్రఫూర్ణ దృ
కంచయ మల్ల నా పయికిఁ జిల్లఁగ బర్వీన యంతమాత్రయంతయి
ట్లంచుఁ దలంచితిన్ దుదకు నాత్రముతో మెయివుల్క రింపఁగన్


కష్టము తీరునంచుఁ దమకంబున వాగ్మి, త్రికాల వేది, నా
కిష్టముఁగూర్ప జాలిన నిరీహుఁ డితఁడని విశ్వసించి, సం
తుష్టిని బొంది సుతముని దూర్వహుఁడౌనని శ్రద్ధతోడ వి
స్పష్టముగాఁ బ్రణామమును జల్పితి దుంపెసలాగు, భక్తితో


84