పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/79

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పు రాణము

మృదులానిలోచ్చ్వాస మృగశాబలోలాక్షి
         యలివేణి, శుక వాణీ యఙపాణి
రంభోరువు పిక స్వర మరాళగామిని
          కోకిల సల్లాప కుందరదన
కాంచననాస పంకజవక్త్రంబింబ బిం
           బోష్టి లతాంగి నీలోత్పలాక్షి
స్త బకలికుచకుచ చంపక సౌగంధి
          వున్నా గనతనాభి పువ్వుబోఁడి


యైన వనలక్ష్మి నవలక్మి యగుచుఁ దనకుఁ
దాన సొబగుగాఁ దాళ వృంతములు దాల్ల్చి
విసరు చుండంగ మెలమెల్ల విసీవి కొనక
పవ్వళించితి నలమటఁ బాపికోనఁగఁ


ఆదరించెడి వా రోక కై నే లేని
కాని పొలిమేర సీమ నేకాకి యగుచు
మేను మఱచి నిద్రించెడి వాని యూడి
గమ్ము చేయుట స్త్రీ స్వభావమ్ము కాదే!


పండుటాకుల సెక్షి వసివాడు దేహంబు
            కసుగంద నీరుండ నొసఁగు సుఖము
చెమట చిత్తడిఁ బుట్టు చిదచిద మాన్పుచు
           గొసరి వీచెడి గాలి యొసగు సుఖము


78