పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/74

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మా శ్వాస ము


భస్మ మలందిన పశుపతి యొడలీ పై
                  గృష్ణసర్పావళీ ఘృణుల యట్లు
శ్వేతవర్ణుండై న సీరి దేహంబుపై
                 నలరు కృష్ణోత్తరీయంబు నట్లు
ఆకాశవీథిపై నట్టిట్టు నెలకొన్న
                 స్వచ్ఛ శర న్మేఘ సంఘ మట్లు
పాల సంద్రము మీఁదఁ బవళించి యోగ ని
                ద్రాస్థితిఁ గూరు మాధవుని యట్లు

గంగ కాళింది జలములు కలసి మెలసి
యా ప్రయాగ సమీపమునందు బహుళ
ఘన రభసమున నురుగులు కట్టుచుండఁ
బొంగి పొరలుచు ముందుకుఁ జెంగలించు,

సంగమస్నానమాడిన సడ్డచేసి
పూర్విసంచిత పాపంబు పోవుననుచు
బుటుకు బుటుకున జలములో మున్గినాఁడ
నలము నీవముచే మేనెల్ల జలదరింప.

అంత సంతర్వాహినియైన సరస్వతీ శైవలిని గూర్చి "కేలుమోడ్చి ప్రయాణాను ఖుండనై, తాపింఛతతరుషండ. నీ రంధ్రాచ్చాయానుషంగంబులైన కళిందాసుత" తటంబుల, వీక్కీం పఁ గాంక్షించి ముందులకుఁ బోవ, శైశనంబునఁ జదివిన , భాగ


73