పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/70

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాస ము


ఆతం డీతరి జహ్ను సు
తొ తడిటినీ తటము నందుఁ దత్పరమతితో
నాతత తపముం జేసెడుఁ
బాతకపాతిత్యహరణ భాగ్యోదయుఁడై.


ఆతఁడు నీదు సంశయము లన్నీ టిఁ దీర్చును దీర్చిసంతనే
యాతనివద్దనుండీ సెలమంది క్రమంబునఁ జాఁగి మ్రొక్కి యా
నీతుల నెల్ల గ్రంథముగ నేర్పున నోర్పునఁగూర్పు దానఁ బ్ర
ఖ్యాతీయుఁజిత్తశాంతియును గల్గును;గల్గును భుక్తి ముక్తులున్ ,


పాలస్తులు కొందరెట్లేని పరిహసింప
దలఁచు చుందురు దానిచేఁ దలఁగవలదు
నిజమెంరింగిన మనుజుండె నీతీపరుఁడు
కాన రౌమహర్షణి బొడఁగాంచఁబొమ్ము,


అని యానతిచ్చి తిరోహితంబగుడు, రాత్రి శేషం బెట్టెట్టులో కడిపి, సంభ్రమాకులుండ నై


తెల తెలవారకమునుపే
కలఁగిన మదితోడఁ గాల్య కరణీయంబుల్
పొలపొలచేసి పదంపడి
వెలలిత నే విజయవాడ వీటికి నేలమిన్

69