పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/66

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా స్వాస ము

రప్పించి మెప్పు పై రత్నాంబరము లిచ్చు
నొసపరి దొరయైన మసఁగవలయు
అడిగించుకొనకుండ నగ్రహారములులిచ్చు
నుర్వీశ్వరుండైన నొప్పవలయు
మదకరీంద్రము డిగ్గి యెదు రేగుదెంచెడి
మండ లేశ్వరుఁ డైన నుండవలయు
తెలవారుటకుమున్న 'దిన వెచ్చ' మంపించు
భూమీశ్వరుండైనఁ బొదలవలయు

దోయిలిడి పత్ర ఫల పుషతోయ మైన
నీయ నేరనీ దేశమం దేవిధంబు
పుట్టఁగలరు స్వతంత్రులో దిట్టకవులు'?
లేరు లేరంచు "గునిసిన లేచి రారు.

కొందఱు సత్యము మెత్తురు
కొందరు అసత్యంబు మెచ్చుకొనుచుందు రిఁకన్
గొందఱు రెండున్ మె చ్చెద
రందకి మెప్పింప సాధ్య మగునే నాకున్,


లోకులు దీట్టిన నిజమే
వాకొనఁగా గట్టిపట్టుఁ బట్టిన వాడన్
లోకుల యిష్టానిష్టము .
లా ! కవిలోకంబుకలము నాట్టంకంగనీ

65