పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/64

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమా శ్వా స ము

అభయహస్తంబిచ్చి యూదరించెద సన్న
జగములొక్కటియైన జంకకుండు
మడిమంచుపడియైన నుడివిన పనియెల్ల
దిగువ మైఁ బట్టి సాధించుచుండు
రౌద్రర సమూర్తి శౌర్యసముదుఁ డద్రి
ధీరుఁ డక్షు ద్రవితరణ దేవ తాద్రు
మమ్ము విద్రావీత రివుండు మహిమభద్ర
మూర్తి మాతండ్రి చలమయ్య పుణ్యకీర్తి,


ప్రాణపంచకమ్ము నంతరాత్మయుఁ గూడ
నాత్మజాత్మజతలైన భాతిఁ
బుర్ర పంచకమ్ము పుత్రిక యొక్కర్తు
కాన్పుపంట యనగఁ గల్గి రండు.

సుకుమారకోమల సుకవితా జిష్ణుండు
గోపాలకృష్ణుండు కోవిదుండు
గురుకులసంవాస పరిగత దేవభా
షా పండితుండు నర్సయ్య ఘనుఁడు
సాధు సజ్జన సంఘసాంగత్య శీలుండు
శ్రీరామనామ సుశ్రీయుతుండు
శాలివాహసరాడ్విజయనాటక గ్రంథ
కర్త సుబ్రహ్మణ్య కవివరుండు


63