పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/63

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము

ఇమ్మహనీయు గర్భమున నీడ్యతరోరుయశఃప్రభాడ్యులై
కమ్మకులావతంసములు గల్గిరి నల్గురు వంశపావనుల్
కొమ్మలు మూఁగురున్, సుజనకోటలు కూటునఁగట్టి మెచ్చలో
పమ్మిసుమంత లేక పెఱవారు స్తుతింపఁ జరించీ రందజున్,

ఇందరిలోఁ దృతీయ సుతుఁ డిద్దపరాక్రమ లాంఛనుండు, సం
క్రందన తుల్యుఁ డార్తజనరక్షకుఁ డాశ్రిత పక్ష పాతి, పే.
రందిన బల్లి దుండు, చలమయ్య సమాఖ్యుఁడు రామమాంబనా
నందవతిస్ వివాహమున సవ్యవిలాసముతోడఁ గైకొనెన్,

ప్రేమమయాత్మ తా నడికీ రేయయినన్ గుడువంగఁ బెట్టీడిస్
దామసమస్న లేదు తన దాయల నై నను గన్నతల్లి గా
నేమి వచించినన్ గవర దెన్న డు మాజహానీమతల్లి సా ధ్వీ
మణి ధర్మము నేటికీ దివ్యపదంబును బొందె ధీర యై

.
అమ్మకడగొట్టుబిడ్డఁడ నాటచేత
నెంతమారాముఁ జేసిన - నేపపడక
విడని గారాముతో నన్ను బెంచె దాన
నమ్మమాట జ్ఞప్తికి వచ్చు సహరహంబు.

కోరమీసము మీఁదఁ గుడిచేయి, నైచిన
సరుల గుండియలు నీఱగుచు నుండు
కనుగొన లెర్రగాఁ గనుగొన నుంకింప
వైరిసమూహంబు వడఁకుచుండు


62