పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వాసము

కలిగినదానిలో మనసుకల్గిన దానినీ గై తచెప్పు వా
రలు కవిరాజులో ! కుకవి రాజులో ! భక్తి పురస్పరంబుగాఁ
బలుకు వేలందిచ్చు నెడఁ బాపము ! కాకవులంచు మాటేకిన్
బలుకుచుదూరు టెల్లఁ దగవా ? తెగవాగిన మెప్పుగల్గునే !

పాయక పూర్వగాథలని ప్రత్న కవీంద్రులు నేఁటిదాఁక, రా
మాయణ భారతాది కృతులన్నియు వ్రాసిరి తిప్పితిప్పి యే
దోయొక కబ్బమంచు దలఁకొక్కటి, యక్కట! నూతనాంశమే
దోయొక పేనియుం దెలుప నోపని గ్రంథసమూహ మేటికో!!


పాక మెట్లున్న నేమి సంబరము?
కవులె రుంగరొక్కొ “లోకోభిన్న రుచి” యనంగ
రసిక శేఖరులగు నెల్లరకు రుచించు
కమ్మతసమునే చూపింతుఁ గైతలందు.

తాతముత్తాతలో కత్తిఁ జేతఁబట్టి
పొదరనుజూపీ రిపుల లోఁబజచుకొనిరి
కమ్మక త్తికిఁ బతియయ్యెఁ గలము, కాని
కత్తిపోటును మిఱదో కలముపోటు,


పూర్వో క్రమంబున నిష్టా నిష్ట దేవతాభి స్మరణాదులు గావించి, పదంపడినిఖిల పురాణవ్యాఖ్యాన వైఖరీసమేతసూతర్షి పోక్షధర్మకథనా సంవిధానంబునకుపక్రమింపక పూర్వము దిక్ప్ర దర్శనంబుగా మద్వంశావతారాభి వర్ణసంబుఁ గావించెద


59