పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణరచనావశ్యకత యేమి?


బోధించి మమ్మీ యత్నమునకుఁ బురికొల్పను. మేమును గుర్వాజ్గ్నాబద్ధులమై గ్రంథరచనకు దొరకుంటిమి .


విప్రుడా! లోకపరివర్తనము గమనింపుము. ఆత్మరక్షణకయి యెట్టిక ట్టుదిట్టములు జరుగుచున్న వోపరికింపు. హిందూ సంఘమునందు నీ వొక్కఁడవే ప్రాజ్ఞుండనై యుండి యధి కారము సాగించుకోనవలయునని యత్నించినచో గొన్నినాళ్ళ కయినను కులక్షయము, సంఘక్షయము కాకమాసవు, ఇతర సంఘములు నిన్ను దిగమింగక మానవు. జపాను దేశమునందలి 'సామోయ్' జూతి చూపిన యూత్మత్యాగములో శతాంశముఁ జూపింపలేవా ! ఆత్మత్యాగమే కాదు ఆత్మరక్షణము, దీర్ఘదృష్టితో విచారింపుము. బ్రాహ్మణేతర విద్యా ర్థులను గొండపల్లెకుం గొంపోయి పరాభవించితినని కులుకు దువా ! దానిప్రతిఫలమేమియో యూలోచించుకొనుము. బాలుర కోమల హృదయ నేత్రములయందు నెట్టి దుర్బీజము లను నాటుచుంటివో తిలకింపుము. నీ బాగోగుల నై స నీవేల చూచికొనవు? అకలంకుఁడును, సత్యధికపూర్వాచార పరాయణుఁడును నగు మాలవ్వాపండినుని వర్తనమునందుఁ గలిగిన పరివర్తనము నైన నేలకక్గొసపు ? దొంగవై హరించిన ప్రత్యేక స్వత్వములను సంఘమునకేల తిరిగి యర్పింపవు ! అర్పింపకున్న నెంతకాలము పొనినిం బట్టి కొని "పెనగులాడ గలవు ! మున్మూటికి నాలోచించుకొని కార్యోన్ముఖుఁడవు


50