పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలియుగ మేది?


మదోన్మత్తులు, ధనలుబ్దులు నగు కొందఱు వావివరుసలు లేక విహరించుచున్నారు. మతాంతర, జాత్యంతర వివాహములు కూడ సమారంభములగు చున్నవి. స్త్రీ, పునర్వివాహములు దట్టమగుచున్నవి, మతవిషయమున నెల్లరకు సరిసమాసము లగు హక్కులు కలుగుచున్నవి.

క లి యు గ మేది? .


పౌరాణికులు వర్తమానకాలమును గలియుగ ప్రథమ పాదననుచున్నారు. కానీ నిజముగ నిది కలియుగ ప్రథమ పాదమేనా ? లేక సంధికాలమా ? ప్రస్తుతము విద్యమాన మగుచున్న లక్షణములఁగూర్చి యిట విపులముగాఁ జర్చించి పాఠకుల నిర్లయమునకు వదలుచుంటిమి.


దు ర్జ్యయమైన భాషయందున్న కథ లెల్లను నజ్ఞులకు, శిరోధార్యములగు సన్న సంగతి లోకవిదితము. ఇది యెరింగియే విప్రులు సంస్కృతము పవిత్రనుగు భాషయనియు, అందలి వాక్యములు భగవదుక్తములనియు, వాని నితర భాషలోనికిఁ బరివర్తసముఁ జేసిన యెడల, వానినంటియున్న పవిత్రత కలుషిత మగు సను సభిపాయము లోకమున వ్యాపింప జేసిరి. సంస్కృత భాషయందలి మంత్రములను దెనుఁగుభాషలోనికి? దెచ్చినయెడల సామాన్య జనంబునకు సవగాహమై యందలి నీతులు ధర్మములు సులభైక వేద్యములగును, మాసనీయము లైనచో మన్నింపఁబడును. కానిచోఁ దిరస్కరింపఁబడును,


41