పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/41

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వర్త మా నము


వావివరుసలు సన్నగిల్లుచున్నవి. అజ్ణానముతో బాటు మూఢవిశ్వాసము మూలముడుంగు చున్నది. "హ్మణ కులమునకుఁగూడ వన్నె దేగలిగిన పండితులు, విద్వవ్వం ద్యులు బాహ్మణేతర కులములయందుఁ బోడముటచే 'బాహ్మణగౌరవము నిదాఘనదీ జలంబులంబలె సదృశ్య మగుటచే దదితర కులములకు సాంఘిక దాస్యవిముక్తి కలుగుచున్నది. బ్రాహ్మణపౌరోహిత్యము లేని వివాహములు వందలకొలంది జరుగుచున్నవి. శ్రీ స్వాతంత్ర్య వాదులు బయలు దేరుచున్నారు. స్వాతంత్ర్య మలవడుచున్నది. వైవా హిక విషయములయం దిది తేట తెల్లమగుచున్నది. స్తైర్య విహారముకూడ మెండగుచున్నది. పట్టణంబుల నాశ్రయించి కొనియున్న యీ యవస్థ పల్లెలకుం బ్రాకుచున్నది. అసూర్యంపశ్యలగు సతీమణుల బిడ్డలు పట్టణములంజేరి నీర్వ్యాపార లై వీధుల వెంటఁ దిరుగుటగానసగుసు. విశేష ధర్మాభిమాసము ప్రజలలో నశించుట చేతను, ప్రభుసాహా య్యము లేని భాహ్మణులు తద్దర్శముల నాచరణకు: "దేఁశాలకు పోవుటచేతను, “హెచ్చులోచ్చులు లేక న్యాయ్యము సమవర్తి యయినది. మద్యపానము, కృత తేత్రా ద్వాపర యుగంబులఁబోలె సన్ని కులములలోనికిం బ్ర వేశించు చున్నది. అప్పుడే కొన్ని కులములకు శిష్టాచారమయినిది త్యజింపఁ బడిన గోమాంసభక్షణము, పాశ్చాత్య సంసగ్గచేఁ దాఁబేటి నడకతో విద్యావంతుల చేరువకుఁ జేరుచున్నది. ఐశ్వర్య


40