పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/402

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భీష్ముఁ డు ఆ సేతు శీతాచలము భారతవర్షమునందలి హిందువులు భీష్ముని స్వార్థ త్యాగియనియు వీతివేత్తయనియు నేఁటివఱకుఁ గొనియాడు చుండిరి. కానీ యింతకంటి, యింత పక్షపాతీ భారత యోధులందు మట్టి యొకరు గన్పట్టరు. దక్షిణ గోగ్రహణ సమయంబున నర్జుసుండు గోవు లను మరలింప దియటపడినప్పుడు పదమూఁడు వర్షములు పూర్తికాలే ధని దుర్యోధనుని నమ్మకము. ఆందుచేతనే గోగ్రహణండు జరిగినది. భీష్ముఁడ దీవినెంగీ చెయ్యకొనియెను, నీజముగఁ దిరుమూఁడు సం వత్సరములు చెల్లిపోయినయెడల భీష్ముందు దుర్యోధమనకు గోగ్రహ జమునకుఁ బూర్వమే వినిపించియుండును. ఆట్లు జరుగలేదు. పదు మూడేండ్లు పూర్తియ్య నేయని తాతను దుర్యోధనుడు ప్రశ్నించి నప్పుడు మహా వీతివేత్తయగు భీష్ముఁ డేమిసమాధానముఁ జెప్పెనో చూడుఁడు. *సీ రెండవయేట నొక్కండధీమాసమి పైక్కిన యన్నెల లెల్లఁగూర్చి కొనఁ బదుమూఁడు హాయనములు దప్పక నిన్నటితోడనే వీండెనంత. ఈసిద్ధాంత మెచ్చటిదో బోధపడదు. అధిక మావములయొక్క యుద్దేశ్య మేమి ? సౌరమాసము ప్రకారము సంవత్సరమున కుండదగిన || 365–8. గంటలు చంద్రమానములోని పండ్రెండు మాసములు గూర్చినఁ గొఱవన దినములను దూర్తిచేయుట కేకదా యేర్పడినది ! అట్టిచో నాయధీమాసములను బ్రత్యేకించి లెక్క పెట్టి దొంగ లెక్క పిద్దము చేసి భీష్ముఁడు దుర్యోధనుని మోసపుచ్చఁజాలెను. ఇట్టి సంప్రతి నెచ్చటను బుట్టియుండఁడుకదా. • విరాటపర్వము, చతుర్ధాశ్వాసము 232వ వద్యము.