పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/39

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క లియు గ ము


జుఁడు వైష్ణ్వేతరులను బెక్కు-ర నుక్కడంచెను.


వావివరుసలు మిగుల కట్టుదిట్టములకు లోఁబడెను. ఈ విషయమున శిష్టాచారము సతి క్రమించినవారలు కడుంగడు "హేయముగా జూడఁబడుచుండిరి. ప్రజాసామాన్యము తమ ధర్మమును గానిసత్యమునుగానీ యెరుంగఁజూలక శోచనీయ దశంబడి పొరలాడదొడంగెను, విస్సన్న చెప్పినదే 'వేద'. మయి బ్రాహ్మణవాక్యము లే మణిమంత్రైషధము లయినవి. ఈ దుస్థితి నూతకోలఁ జేసికొని విప్రులు ప్రజలయొక్క సూక్ష్మ దేహమునే నశింపఁ జేసిరి. దీనికై యవలంబింపఁబడిన మార్గములు పండిత జనగర్హ్యములు, పౌరాణికులు ధర్మమును సామాన్యధర్శములనియు, విశేషధర్మము లనియు విభజించి లోకప్రతారకులైరి. వి శేషధర్మములు బ్రాహ్మణేతరలోకమునుఁ బీల్చి, పిప్పిఁ జేయుటకు నొడ్డిన యురులు. కాలక్రమమున నీయురులే యొడ్డిన వారి కుత్తుకలను నులిమి వేయు కొఱముట్లయినవి. ఈ యవియేయార్యయజాతి పతన హేతు వై సవి. ఆర్వధర్మము తురకమసీదయినది. కరిమ్రింగిన వెలఁగ పండయినది. మధురోగి శుష్కకళేబర మయినది. మతాంతరులచే గ్రహితమయినది. హిందువు నిలువుగ్రుడ్డున బాహ్య ప్రపంచమును వీక్షింపఁదొడఁగెను; నిర్జీవప్రతిమ యయ్యెను; శుష్క- వేదాంతము శరణముఁ బొందెను.


38