పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలి యు గ ము


వాదము బయల్వెడ లెను. [1]* శూద్రుఁడై న యుగ్రశవనుఁడు తనకుఁ బ్రత్యుత్థానముఁ జేయ లేదని బలరాముఁడు త్రాగిన మైకములో నాగలితోఁ బ్రాణములు గొనియెను. ప్రజలల్పాయుష్యులు గారు; దుర్బలులుగా గూడ లేరు, రామాయణ యుద్ధకాలముననున్న ద్వివిదుని బలరాముఁడు సంహరింపం గట్టెను. జాంబవంతుని గృష్ణుఁ డొడిచి వుచ్చెను. పరశురా ముని గురుకుల పీతామహుఁ డయిన భీష్ముఁ డొడించెను. గాంధర్వము, రాక్షసము, స్వయంవరమునకుఁ దోడు వధూ వరుల జననీజనకులే పెండ్లి రాయభారములు సాగింప జొచ్చిరి. **[2] అచ్చటచ్చట వధూవరు లేర్పఱచుకొన్న నిబంధనల పై వివాహములు సాగుచుండెను. ***[3]


క లి యుగ ము


విద్య, ద్విజుల ముల్లె యనుమాట ప్రచారములోనికి వచ్చెను. తాము చదువవచ్చు ననుటకన్న ఇతరులు చదువ గూడ దను వితండవాదము హెచ్చినది. శ్రీలస్వాతంత్ర్యము నిర్మూలింపఁ బడినది. బుద్ధ దేవుని మహిమాతిశయముచే యజ్ఞయాగాదులు నశించినవి. బలులు మటుమాయ మైవి,



  • **


---భారతము,

36

  1. భాగవతము.
  2. శశి రేఖావివాహము, ఉత్తరావివాహము
  3. జరత్కారుని వివాహము, ఉలాచీ చిత్రాంగ వివాహము.