పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/29

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యు గ ము లు


కాదా? చేజిక్కి–న నీరుపమాన సౌందర్య ఖనియు, బలవద రాతులయిన తురుష్కుల రాణివాస స్క్రీయునగు, మదవతీ శిరోవతంసమును మాతృభావమున సౌజన్మవిరోధియగు మొగలాయి చకవర్తి సన్నిధికంపిన ఛత్రపతి శివాజి, త్రిభువ నసామ్రాజ్యమదంబున విజ్ఞుఁడయ్యుఁ గపటాకారంబున, విషయవాంఛాపరత్వంబున, మునిపత్ని నిమోసగించి సంభోగించిన యింద్రునికన్నను, భర్తయగు శంఖచూడుని జంపి తద్వేషంబున మహావతివ్రతయగు తులసీపతిని వంచించి రతొక్రీడలం దేలిన శంకరునికన్నను, వివాహితయగు స్త్రీని బలాత్కారం బుగ రాజ్యగర్వంబునఁ దెచ్చి మన్మధ క్రీడలకుం జొచ్చిన త్రిశంకునికన్నను నుత్తము:డుకాఁడా? శివాజీ కాల మేయుగ మగును ఇంద్రాదుల కాలమే యుగమగును? యోజించిన బోధపడకుండునా. ఉపర్వు క్తవురాణగాథలు పౌరాణిక వాద మును నిర్మూలితము చేయుచున్నవి. మహనీయుల నిష్క ళంక పవిత్రపరివర్తనచేఁ దెలుపఁబడిన సామాన్యజనముక ధర్మాధర్మ ప్రవర్త నముపై యుగములాధారపడియుండును. అనఁగాఁ గృతత్రేతా ద్వాపర కలియుగంబు లొకదానిని వెన్నంటి యొకటి రావలయునను మర్యాద లేదు. తారుమా రుగా రావచ్చును. హిందూ దేశమున నెన్ని సారులో యిట్టీ యుగపరివర్తనము తటస్థించినది. ఆత్మలాభము నపేక్షించి వేలకొలంది గోవులను వధించి యజ్ఞమను మిషచే విప్రసంత ర్పణముఁ గావించిన రంతి దేవుని కాలము కృతయుగమా ?


28