పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/226

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


ద్రుపదరాజస్య వంశంబు దొట్టుటకును
నగ్నిగుండంబులో నిప్పు డవతరింప
జేసె నీయమళంబును సృష్టికర్త
యనుచుఁ దడ బాటు లేకుండ సనిరి మునులు,


ద్రుపదధరాధి నేత పరితోషవశంవదుఁ డై వినీతుఁడై
విపుల తపోధనుల్ మిగులఁ బ్రేమను దీవనలిచ్చి పంపఁగా
నపుడె శిశుద్వయంబును బ్రియంబునఁ దోడ్కొని ప్రోలుచొచ్చిమో
హపరవశత్వభావమున నన్నియు నేమణిపోయే నక్కటా !



యజ్ఞ వేది కొమధ్యమం దవతరించి
నందున నయోనిజులు కసిగందులనుచుఁ
జూబెఁ బాంచాల మెల్లను మాటుఁ బెట్టి
వారి యన్వయంబుఁ దెలియఁబజచకుండ.



కృష్ణ యను పేర బాల వర్ధిష్ణయగుచుఁ
బాండవేయుల యుమ్మడి భార్యయయ్యె
బాండవ పృతనాధీశుఁడై బాలకుండు
వినుతి కెక్కె ధృష్టద్యుమ్నుఁ డనెడి పేర.


పుట్టుపూర్వంబు లజ్ఞాతంబులగుటం జేసి, కాలవశంబున సయోనిజుఁడ నెడి పేరు విలు పంబగుడు, ధృష్టద్యుమ్ను ఁడు పాంచాలుండయ్యెఁ గృష్ణయుఁ బాంచాలియయ్యె. ఇదియ సురాసురాయోనిజుల పూర్వవృత్తంబు. విస్తరించి యెఱింగిం



95