పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/222

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


బిడ్డలుసూడుఁ దీర్పగల వీరులు గల్గమిఁ దాల్మి లేక యే
యడ్డము వచ్చినప్పటికి నైన గదించి నితాంతశక్తి నే
వెడ్డను నేనియుం దగిన బిడ్డలఁబొండెడీ నిశ్చయంబుతో
నెడ్డఁదలఁచి మంచితరి యెప్పుడువచ్చునోయంచు నుండఁగన్ ,



ఉత్తర కురుభూములలో
నుత్తర దిగ్భాగమం దయోనిజ తండం
బత్తరి గాపురముండిన
నృత్తాంతం బెఱిఁగి చరుల వేంటనె పంపన్,



యాజోషయాజులను ముని
రాజుల యువ దేశమంది రహీఁ భారత పృ
థ్వీజాని యానఁ దలనిడి
జాజరతో వారు పనిని సాధింపంగ్,



వేగులవాండ్రావీటికి
వేగమ చని యందుఁగల్గు బిడ్డల నెల్లన్
బాగుగఁ గని పెట్టుచు నా
భాగమ్మున వేచియుండ బహు నైపుణీతో.



పొంగా రెడి లావణ్యము
బంగారముఁ బోని మేనివన్నియ మిగులన్
రంగా రెడి సౌష్టవమును
సింగారము గల్గియున్న శిశువుల నెల్లన్

.

91