పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/221

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతపురాణము


గురుదక్షిణగా భార్షత
సరపాలకుఁ గట్టి తెచ్చి నాకొసఁగుడి యో
ధరణీశతనయులారా!
యఱమఱలే కంచు ద్రోణుఁ డాడిసయంతన్ .


ఉరు గర్భాపరిపూర్ణ ది టుఁడునై యు ద్వేగ సంరంభుఁ డై
సరసింహాకృతి దివ్య ఘోర విలసన్నా రాచతూణీరుఁ డై
నేరుఁడుగోద్ధతిఁ వార్షతుఁబొడిచి విన్నాణంబుతోఁ దెచ్చి భూ
సుర పాదంబుల మ్రోలఁబెట్టఁ బరితుష్టుం డై యతం డిట్లనెస్.



వీరెవ్వరు ద్రుపద ధరా
పరులా ! యిట్లేల వచ్చిషకీ నారలు భూ
సురపదములపై తగునే
మరి ! యం చుడికించి పెక్కుమాటల చేతన్,'



విడిచిపుచ్చినఁ బాంచాల విభుడు మాన
ధనుఁడు రాజలోకమునందుఁ దనకు సంభ
వించినట్టి పరాభవ మెంచి క్రోధ
తప్తచిత్తుఁడై పగ నీగ దారి లేక..



తండ్రిసూడు దీర్పఁ దగిన సూనుఁడు లేమిఁ
దనకుఁ గడిమి లేమిఁ దలఁచి తలంచి
ననట మిగులఁ జెంది పగఁబట్టియున్న
తాచుపామునో బెఁ దల్లడిలుచు.


90