పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/215

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతపురాణము


గొఱ్ఱలను మేకలను గొంతుఁ గోయమాని
గొంతుఁగోయుఁడీ గోవులన్ గుఱ్ఱములను
సంశయింపంగ నా కేల సత్య మిదిగో !
చచ్చిపోయిన పిదప మోక్షంబువచ్చు.


జుంటి తేనే పూఁ దేనియల్ జుర్రమాని
జుఱ్ఱుఁడీ మీరు కడుపాఱు సోమరసము
సప్సరఃకామినీ మధురాధరమ్ము
బానమును జేయు యోగ్యత పట్టఁగలదు.



అబ్బురపాటు సాటిలఁగ సందరు నీగతి వేడబంబుతో
నిబ్బరమైన పట్టుదల నెక్కొన నచ్చఁగఁ జెప్పి మైకమున్
బ్రబ్బగఁ జేసి ద్రావిడుల వంచనఁ జేయుచు నార్యకింకరుల్
దబ్బగలాడి యాడి తమదారికిఁ ద్రిఫ్ఫిరి కొంతమందినిన్

.
పిమ్మట నార్యకింకరు లుపజాపకు లై ఫుటమరించి నిక్కి-
నీల్లుచు విర్రవీగుచుఁ గ్రిందుమీదెఱుంగక, స్వజాతినిధిఃకరించి
స్వజాతీయుల మూఢులని తలపోయసాగి క్రమకమంబుగా-


మాతృ భాషాభిమానంబు మఱచిపోయి
యస్య భాషయనెడి బై సియైన లేక
సంస్కృతంబును శ్రద్ధగాఁ జదువసాగి
యీసడించి వైచిరి సొంత బాస సకట,


84