పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/211

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


కతిపయ శిష్యులుంగొలువఁగాఁ బయనంబయి యిపై వింధ్యప
ర్వత వనభూములంగడచి ద్రావిడ దేశముఁజొచ్చి యచ్చటస్
బ్రతివసధంబునన్ విడిసి వారలకుం దలలోని నాల్కనై
మతమును బోధ సేయు మిష మర్మముతో నటియించి సిమ్మటన్" ,


భేదోపాయముచేతన్
భేదము పుట్టించి మిగుల భేదజ్ఞుడనై
వాదులతో మూదలతో,
గాదనకొప్పించి తీర్పఁగదె మన పనులన్ ,



ప్రజ్ఞచేత దివ్యమగు సుషజ్ఞ చేత
లోకవృత్తం బెఱుఁగజాలు మీకు ధర్మ
ములుపదేశించు పాటివారలము కాము
గాని చెప్పుచుంటిమియని యైన వినుఁడు.



బెరసిమాటాడఁ బోకు మీ పరులతోడ
నరసిసాగింపు తంత్ర మాదరముతోడ
మురిసి కిటు కేమి చెప్పకు మొరులతోడ
నిరిసియైనఁ బట్టినపట్టు సెల్లఁ దీర్పు,



దేశ కాల పాత్రంబుల దీర్ఘదృష్టి
సఖముఖంబులఁ బరికించి నిఖలగతుల
విప్రకారంబుఁ దగ సైచి వేచియుండి
మంచి కాలంబున విరోధి నొంచవలయు.

80