పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/207

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


బాటసారులు నిలువంగ బాటకడల
వేసి పెంచిన తోటలు వినుఁగు లేక
నీడనిచ్చుచునున్నవి నేఁడుకూడ
"వనము తోటలు", దక్షిణ పథమునందు.


• కాలవశంబునన్ ద్రవిడ ఖండము సర్వము ఛిన్న భిన్న మై
వ్రీలిన భిన్న రాష్ట్రములు భిన్నకులంబులు నుద్భవిచెంద
న్మూలమునన్ బురాతన సమున్నతి కోల్పడిపోయి పిమ్మటన్
జాలఁ గృశించెఁ గందువడే శాతవులుం దలలెత్త వెండియున్ ,


అబ్బురవు కాల వైపరీత్యంబుచేత
రాష్ట్రములు చీలిపోయిన రాజు లెల్ల ,
జెదరి నలుదిక్కులకు నేగి చిన్న చిన్న
సీమలార్జించి దొర లైరి నేగి లేక .


దేశ కాల పాఠంబులవలనఁ గల్గిన పెక్కు మార్పులచే
నాయా సీమలకు నేగిన ద్రావిడులు, నూతనాచారంబులు పట్టు
పడుటచే భిన్న నామరూపంబులం దాల్చి విజృంభించి, పదంపడి
దక్షిణాపథమును మరల దక్కోలుఁ జేసికొని, వివిధ ' రాజవంశం
బుల పేరిట, నిష్కంటకంబుగా మహావైభవముతోఁ బరిపాలిం
చిరి. కాలాడు. రూపంబునఁ గల్గిన యీ పరిణామదశను నాను
పూర్వికగ వర్ణించుట సుకరంబుగా దయినను, నాన్చేసకొలఁది
పెద్దలవలన యెఱింగిన కొలది యెఱింగింతు .నా లింపుము,


76