పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/202

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


కోయ నయితికాని తీయ మామిడిపండ్ల
జేతికందిచ్చెడి చెట్లనడుము
జడి వాసకైనను దడియకుండఁగనుంచు
ముండ్లు గల్గని పొద రిండ్ల నడుమ



మోరలు పై కెత్తి ఫుల్లావు పెయ్యలు
కేళ్లువా రెడి పచ్చి బీళ్ళనడుమ
ఎండ కారుననైన నెండి. పోవని తేట
కొండవ్రంతలకొండ కోననడుమ


విపుల క్రొందావిఁ జిల్కు పయ్యెరలు గ్రోలఁ
బాఱుటాకులపాక లేర్పఱుచికొనుచు
సందుఁ డలదాఁచికొను ద్రావిడాళినెల్ల
వాసరులటంచు నార్యులు వదలినారు.


గడుసు రాయబారము లేట్లు నడపఁగలరు !
కడలి కానకట్టల నెట్లు కట్టఁగల !
కా సెపని నేర్చి 'యిండెట్టు కట్టఁగలరు !
వానరు లెయైన ద్రావిడ ప్రజలు చెపుమ.


అగ్ని సాక్షి, ప్రమాణంబు లాచరించి
వ్రేల్మడచి పరుల్ తప్పుఁ జూపింపరాని
రీతిగా నెట్టువారు వర్తింపఁగలరు ?
వాసరులె యైన ద్రావిడ ప్రజలు చెపుము !

71