పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ స్వామి గారు


త్యాన్ని గూర్చి ప్రచారం, మాంసంతినటం మానిపించేరు. యజ్ఞోపవీతాలు చేయించారు. స్వకులంలో పురోహితులను సృష్టించారు. మంత్రాలు చదివించారు. 'పెండ్లిండ్లు చేయిం చారు. యజ్ఞాలు చేయించేరు.

కొట్లారు కమ్మ మహాజనసభలో "కమ్మవారు క్షత్రి యులా ? అంశంమీద శంకరపీఠాధి పతులతో వివాదం. పీఠాధిపతుల పలాయనం.


తెనాలి చైర్మన్; ఆంధ్రాయూనివర్సిటీ సెనేట్ మెంబరు; ' తెలుగు టెక్ట్కబుక్క మిటీ మెంబరు_సంస్కృత ప్రాముఖ్యము తగ్గించటానికి ప్రయత్నం.


చైర్మన్ గా వుండగా:


కొలుపులొచ్చాయి. కొలువులు కొలవాలనీ అమ్మ వారికి బలివ్వాలనీ, కౌన్సిల్లో మెజారిటీ పట్టుబట్టింది. రామస్వామిగారి "పార్టీలో ముఖ్యు లే, పట్టుపట్టటం ! రామ స్వామిగారు విన లేదు జీవహింసకు వొప్పుకోను” అన్నారు. ఊరంతా అలజడి. "అయి తే విశ్వాసరాహిత్య తీర్మానమే" అన్నారు కౌన్సిలర్స్, "ఏమైనాసరే?” అన్నాడు రామస్వామి గారు, విశ్వాసరాహిత్య తీర్మానం పెట్టారు. కాని చౌదరీగారు విన లేదు, ..ఏమైనా స రే" అప్పుడు కొలువులుమాత్రం జరగలేదు. జీవహింస ఆగిపోయింది.


ఈ రోజుల్లో సూతపురాణ ప్రచురణ: ------------

పాతపురాణాల్లోని పొల్లు సర్వమూ తూర్పారబట్టారు.