పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/183

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము


పలుకరింపని దొరవంకఁ బాఱజూచి
మూతి బిగఁబట్టి లోలోన రోతపుట్ట
నాడర్నిషని రేనిరాజ్యంబుఁదొలగి
వలసపోవుటే మిగుల సంభాన్యమనుచు.



వేల్పురేని దివాణంబు విడిచి పెట్టి
వసం దెఱగంటి మూకలబంటు లపుడె
గుసగుసలువోయి యొకచోటఁ గూడి మాడి
పట్టుంబట్టిరి యెట కేని వలసపోవ.


అంత దేవతానీకమ్మునందుఁ గొన్ని
తెగ లయోనిజప్రభృతులు తెగువఁజేసి
యిళ్లు వాకిళ్లు తెగనమ్మి గొల్లుమనుచు
పనవి యొక సారి నాకంబువంకఁ జూచి.


తరతరంబులనుండి తనివోవఁగాజేయు
సురనిచ్చు చెట్లను సురుగుటెట్లు ?
బెదరించి యందందు బెల్లించుకొని తెచ్చు
హవ్యకవ్యములం బోనాడు టెట్లు?

మున్నూట యర్వది ప్రొద్దుల మురిపించు
వెల్లాటక త్తెల వీడుటెట్లు
మందయానలతోడ మందాకిని మునింగి
విహరించుకోర్కెల విడచు టెట్లు?

.

52