పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/181

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూతపురాణము


న్యాయమగునె వైతండికు లాడుమాట
పాటి సేయుట నీవం టి పండితునకు?
పక్షపాత భూయిష్టమౌ పాఠములను
వ్రాసి పెట్టెను దేవతా నందికోటి.


ఆ నినయసంతరమునారదమౌనీంద్రుక డ సెలనంది, మనో
నేగంబున భాగీరథిందాఁటి కైలాసంబుత్తరిం చి, హిమవంతంబు
సతిక్రమించి, భారతవర్షంబు జొచ్చి, నాకై యెదురు చూచు
చున్న వాల ఖల్యాదులకు సర్వంబుని వేదించి, యామంత్రణంబు
వడసి, యతిజవంబున నా యీ యాశ్రమంబును జేరి యథా
స్థితిగా భగవత్కాలక్షేపముం జేయుచుంటినని చెప్పి పిమ్మటి
కథ వచియింప నుపక్రమించె,



వేల్పుల వలస



కోలము మంచిదై విరివిగాఁ దెగఁబండిన పంట పైరులే
చాలవు పొట్టకూటికయి స్వర్గమునందు వసించువారికిన్
నాలుగు రెండు మాసములు నాతముకూడ లభింప దాపయిన్
గూళియు నాలి చేపడడు కొంచెము సైతము చెప్ప నేటికిన్ ,


ఈతి గాధలు గల్గుచో నింక నేమి
కలదు! సల్ల వో! గ్రుక్కెడు గంజియైన
 బొక్కె డన్న మైనను బుట్టఁబోవ దందు
నిట్టినాకికయం దొక్క యేఁడు సందు.


50