పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రా మ స్వామి గారు


దూషణ తిరస్కారాలు, అప్పటి రామస్వామిగారిస్థితి శంబుక వధలోని అంగదుడే చెప్పాడు...'సాకృతజనంబునకు మీ చరిత్రము దురవగాహము, ద్విజులు మిమ్ముఁ బాషండుఁడ వనియు, మతద్రోహివనియు "దెగడుదురు." దిజేతరులో విద్యాగంధము లేమిచే బ్రాహ్మణ ద్వేషివనియుఁ దన్మూల మున రాజదండనకుఁ బాత్రుడవనియు గొణుగుదురు. కట్ట కడకు మీ మీరిరు తెగలకు గానివారగుట యే ఫలితము.'

ఇలాగే వుండేవీ పరిస్థితులు కూడా! అగ్రజాతిలో ద్వేషం పెరిగిపోయింది. మిగిలిన వారిలో భయ మేక్కువైంది. దగ్గరకు 'రావటానికి భయఓ తమను కూడా లోకం బ్రాహ్మణ ద్వేషులని దూషిస్తే ! కాని ఆరోజుల్లో కూడా అమృత ఘడియలు లేక పోలేదు.

ఒక మీటింగులో ఉపన్యాసంచేసి రామస్వామిగారు బయటికి వచ్చారు. ఒక శతవృదు కర్ర తోపోటుతోవచ్చి అమాంతంగా రామస్వామిగారిని కౌగలించుకొని ఆవురుమన్నాడు. ఏమి " ?” అని తబ్బిబ్బుపడుతూ అడిగారు రామస్వామి గారు, “ఏం లేదు బాబూ ! ఇక నే నేక్కువరోజులు బతకను. నిన్ను చూచి చచ్చిపోదామని వచ్చాను ఆ న్నాడు ఆ శతవృద్దు .

తరువాత టంగుటూరు కమ్మ మహాజన సభ కధ్యక్షత. మదరాసులో జరిగిన కమ్మ మహాజనసభలో స్వసంఘ పౌరో హిత్య తీర్మానం. మళ్ళీ మీటింగులు. స్వసంఘ పౌరోహి


11