పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/179

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము



కొమరుప్రాయమునాఁడు కుంతి భోజు నీపుత్రి
               సూర్యోపగూహన సుఖను కనదె ?
పుత్రార్థి మాద్రీ యశ్వులఁబొంది రహి నొక్క
                 పర్యాయ మె కవలఁ బడయ లేదే !
మేనకా కనకాంగి మౌని విశ్వామిత్రు
                  నెట్టన గిరిగీసి నిల్ప లేదా?

పుంజికస్థల యొడల్ పులకరింపఁ బురూర
                  వుని గూడి ప్రొద్దులు పుచ్చలేదె ?


దశరథుండును ముచికుంద ధరణి విధుఁడు
దిక్కుమాలిన దేవతల్ దేవురింప
వచ్చి బాసటయై నిలువంగ లేదా ?
పొంగెమున్న దే యని యేల ప్రశ్నఁ జేయ ?


సురయనంగ మద్యంబు తత్సురను ద్రావి
వినుతి కెక్కిరి సురలను పేరిచేత
సురను నొక్కనాఁడేని మూచూడకున్న
శారణముచే ససురు లైరి కడమవారు.

ఆర్తర పరాయణు లవుటచేత
వాసిఁ గాంచిరి రాక్షసప్రవరు లనఁగ
యాతనా ప్రాణివితతిఁ గోపాడుక తన
యాతుధాను లనంగఁ బ్రఖ్యాతి గనిరి.


48